Hyderabad, మే 11 -- తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలకు చక్కగా పెంచాలనీ, వారు జీవితంలో ఉన్నత స్థాయిలకు ఎదగాలనే ఆశిస్తారు. ఇందుకోసం ఎంతో కష్టపడతారు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అయితే కొన్నిసార్లు తెలియకుండా వారి పెంపకంలో కొన్ని పొరపాట్లు జరగచ్చు. అవి భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపవచ్చు.

అవును.. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. పిల్లలు పెద్దవారిలాగా తమ భావోద్వేగాలను వ్యక్తపరచలేరు. కానీ వారు బాధపడుతున్నప్పుడు, మనం వారికి సరైన మార్గదర్శకత్వం అందించాలి. మన దైనందిన కార్యకలాపాల్లో కొన్ని పిల్లలకు కష్టంగా అనిపించవచ్చు. వారు మౌనంగా బాధపడుతుంటే మనం గమనించి వారికి సహాయం చేయాలి. అంతేకానీ వారిని బాధపెట్టకూడదు.ఇలాంటప్పుడు తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు పిల్లల జీవితంలో దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుత...