Hyderabad, మే 20 -- డయాబెటిస్ అంటే కేవలం పెద్దల్లో వచ్చేదని ఎక్కువమంది అనుకుంటారు. నిజానికి డయాబెటిస్ ఇప్పుడు పిల్లల్లో కూడా వస్తున్నట్టు గుర్తించారు. వారసత్వంగా అలాగే చెడు జీవనశైలి కారణంగా ఇలా డయాబెటిస్ వస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. వారిలో కనిపించే కొన్ని రకాల లక్షణాలను తల్లిదండ్రులు విస్మరిస్తున్నారు.

పిల్లల్లో డయాబెటిస్ లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి వాటిని గమనించి తల్లిదండ్రుల అర్థం చేసుకొని తగిన చికిత్సను సరైన సమయానికి అందించాలి.

పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ అనేది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. దానివల్ల లక్షణాలు ఒకేసారి బయటపడవు. తక్కువగా ఈ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. మీ బిడ్డ తగినంత నీరు తాగుతూ ఉన్నా కూడా తరచూ దాహం వేస్తుంటే మీరు ఆ విషయాన్ని విస్మరించకూడదు. టైప్ 2 డయాబెటిస్ లో ఎంత నీరు తాగినా దాహం వేయడం అనేది ఒక ప్రధాన లక్షణంగా ...