భారతదేశం, ఏప్రిల్ 29 -- సినిమాల ద్వారా నేర్చుకునే విషయాలు పిల్లలకు బాగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వారికి వీలైనప్పుడు స్ఫూర్తి కలిగించే చిత్రాలను పెద్దలు చూపించాలి. చదువుపై ఆసక్తిని కలిగించేలా కూడా కొన్ని సినిమాలు ఉంటాయి. ఇలాంటి సినిమాలను పిల్లలను చూపించేందుకు వేసవి సెలవులు సరైన సమయం. బాలీవుడ్‍లో వచ్చిన కొన్ని చిత్రాలు పిల్లల్లో స్ఫూర్తిని పెంచేలా ఉన్నాయి. వాటిలో ఐదు సినిమాల గురించి.. అవి ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి. ఈ సెలవుల్లో వీలైనప్పుడు పిల్లలకు చూపించండి. అవేవంటే..

రోడ్‍సైడ్ చిన్న టీ షాప్‍లో పని చేసే చోటూ (హర్ష మహర్) చుట్టూ ఐయామ్ కలాం సినిమా స్టోరీ ఉంటుంది. 2011లో వచ్చిన ఈ చిత్రం చాలా ప్రశంసలను అందుకుంది. బాగా చదువుకోవాలని, అప్పటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత గొప్పవాడని కావాలని కలలు కంటూ ఉంటాడు చోటూ. కానీ ఆర్...