భారతదేశం, మే 16 -- హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలకు.. వివిధ దేశాల నుండి సుందరీమణులు వచ్చారు. వీరు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. 16 వ శతాబ్దానికి చెందిన శ్రీ రాజ రాజేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. ఫొటోలు దిగారు. పురావస్తు ప్రదర్శన శాలను సందర్శించారు. అక్కడ చారిత్రాత్మక శిల్పాలు, ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన పురాతన కళాఖండాలు, వాటి విశిష్టతలను తెలుసుకున్నారు. మ్యూజియం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫొటోలు దిగారు.

అనంతరం పిల్లలమర్రి మహా వృక్షాన్ని సందర్శించారు. 700 సంవత్సరాల వయస్సు కలిగిన మహా మర్రి వృక్ష ప్రకృతి అందాలను చూసి.. సుందరీమణులు తన్మయంతో మైమరచిపోయారు. అడుగడుగున తెలంగాణ సాంప్రదాయ సాంస్...