భారతదేశం, జనవరి 29 -- సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి మైనర్లను దూరంగా ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోంది. సోషల్ మీడియాలో జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై జరిగిన మంత్రుల బృందం సమావేశానికి మంత్రి నారా లోకేష్ అధ్యక్షత వహించారు. సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ వంటి దేశాలలో పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌కు సంబంధించిన నిబంధనలను అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నియమాలను రూపొందించాలన్నారు.

మలేషియాలో డిజిటల్ ఐడీ, పాస్‌పోర్ట్ వివరాలతో అనుసంధానించిన e-KYC ద్వారా 16 ఏళ్లు పైబడిన వ్యక్తులకు మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ అనుమతించబడుతుందని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశంలో తెలియజేశారు. సోషల్ మీడియా నుండి పిల్లలను దూరంగా ఉంచాల్సిన అవసరాన్ని మంత్రుల బృందం ఏకగ...