Hyderabad, ఏప్రిల్ 22 -- వేసవి సెలవులు రానే వచ్చాయ్. పిల్లలు ఏం చేయాలో తెలియక రోజంతా టీవీ చూస్తూ, ఫోన్ స్క్రోల్ చేస్తూ టైమ్ వేస్ట్ చేస్తుంటారు. వారి కోసం ఏం చేయాలో, వారిని ఎలా ఆడించాలో అర్థం కాక తల్లిదండ్రులు తల పట్టుకుని కూర్చుంటారు. ఇకపై నో మోర్ బోర్ కొట్టడం! మీ పిల్లలకు 'లెజెండరీ' ఎక్స్‌పీరియన్స్‌ కలిగించే బెస్ట్ ఐడియాను మీ కోసం మేం పరిచయం చేస్తున్నాం. అదే సమ్మర్ క్యాంప్!

సమ్మర్ క్యాంప్స్ అంటే ఇది కేవలం కొన్ని రోజులు ఆడుకోవడం, తినడం, పడుకోవడం మాత్రమే. అదెలాగూ ఇంట్లో చేసేదే కదా ఎందుకు మనీ, టైం రెండూ వేస్ట్ చేసుకోవడం అని చాలా మంది తల్లిదండ్రులు ఫీల్ అవుతారు. ఈ ఆలోచన చాలా తప్పు. ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ అలా లేవు. ఇప్పుడివి చాలా అప్‌డేట్‌గా ఉంటున్నాయి. ఈ క్యాంప్స్ మీ పిల్లలకు కేవలం హాలిడేస్ ఎంజాయ్ చేసే ప్లేస్‌ మాత్రమే కాదు, వాళ్ల లైఫ్‌లో ...