భారతదేశం, జనవరి 13 -- భోగి పండుగ అంటే మొట్టమొదట మనకి గుర్తుకు వచ్చేది భోగి మంటలు, భోగి పండ్లు. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తూ ఉంటారు. అయితే చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసేటప్పుడు పద్ధతిని పాటించాలి. చాలా మందికి భోగి పండుగ ఎలా పోయాలి? మొదట ఎవరు పొయ్యాలి అనే సందేహాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగువారు ఎంతో ఇష్టంగా, ఆసక్తిగా ఎదురు చూసే పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటాము. మొదటి రోజు భోగి పండుగ, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాల్గవ రోజు మొక్కల పండుగలను జరుపుకుంటాము. మొదటి రోజు జరుపుకునే భోగి పండుగకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు.

ఇది ఎంతో ముచ్చటగా, అందంగా ఉంటుంది. పిల్లలకు భోగి పండ్లు పోయడం, పేరంటాళ్లను పిలిచి వాయినాలను ఇవ్వడం.. ఇలా ఎవరి పద్దతిని ...