భారతదేశం, డిసెంబర్ 26 -- మన దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదికని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం తిరుమలలో నిర్వహించిన సమ్మేళన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ప్రాచీన కాలంలో భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లిందన్నారు. ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పిందని గుర్తు చేశారు.

2600 ఏళ్ల క్రితమే భారత దేశం ఆయుర్వేదం ద్వారా వైద్య సేవలు అందించిందన్నారు సీఎం చంద్రబాబు. పూర్వ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వ విద్యాలయం నిర్మించుకున్న దేశం మనదని చెప్పుకొచ్చారు. మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదే అని తెలిపారు.

"అస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యు...