Hyderabad, ఆగస్టు 30 -- పితృపక్షం చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయంలో పూర్వీకుల్ని ఆరాధించడం వలన పూర్వికుల అనుగ్రహం లభించి సంతోషంగా ఉండవచ్చు. పూర్వీకుల ఆశీస్సులు ఉంటే శుభ ఫలితాలను ఎదుర్కోవచ్చు. అయితే, పూర్వీకులు చనిపోయిన తరువాత ప్రతి ఏటా దానధర్మాలు చేయడం, తర్పణాలు వదలడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. పితృపక్షం సమయంలో కూడా కొన్ని పద్ధతులు, పరిహారాలను పాటించడం వలన పూర్వీకుల అనుగ్రహం లభించి సంతోషంగా ఉండొచ్చు.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 నుంచి మొదలై సెప్టెంబర్ 21 వరకు ఉంటుంది. పితృపక్షం సమయంలో పూర్వికుల పేరు చెప్పి కొన్ని దానాలు చేయడం వలన మంచి ఫలితాలు ఎదురవుతాయి. మరి పితృపక్షం సమయంలో వేటిని దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి దానం చేయడం వలన నిద్రపోతున్న అదృష్టం కూడా మేల్కొంటుంది. పితృపక్షం సమయంలో కొన్ని వస్తువులను దానం చేస్త...