Pithapuram, ఏప్రిల్ 25 -- పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను.. 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రూ.34 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రిలో రెండు కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చురీ వార్డు, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి నిర్మాణం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలతోపాటు ఆరు పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ...