భారతదేశం, మే 13 -- కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనివ్వడాన్ని అవమానంగా భావించిన మహిళ.. పసికందును అడ్డు తొలగించుకుంటే కూతురికి రెండో పెళ్లి చేయొచ్చని భావించింది. అమ్మ, అమ్మమ్మ కలిసి ఐదు నెలల పసికందును చంపేసి బావిలో పడేశారు. చివరకు పోలీసుల విచారణలో దొరికి పోయారు.

రెండో పెళ్లికి అడ్డుగా ఉందని ఐదునెలల పసికందును గొంతు నులిమి చంపేసి బావిలో పడేసిన ఘటనలో తల్లితో పాటు అమ్మమ్మను నిందితులుగా గుర్తించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీలో గత వారం జరిగిన ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు.

మే 6వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఐదు నెలల చిన్నారి యశ్వితను గొంతునులిమి చంపేసి ఇంటి వెనుక భాగంలో ఉన్న నూతిలో పడేశారు. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కన్న తల్లితో పాటు, అమ్మమ్మలను హంతకులుగా తేల్చారు. చిన్నా...