భారతదేశం, మే 9 -- 'మన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి.. ఎవ్వరినీ వదలం.. సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టం.. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం' అని వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కామెంట్స్‌పై ఇప్పుడు ఏపీ పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

'కేవలం వైసీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు.. కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తా. ఈరోజు చంద్రబాబు, పోలీసులు చేస్తున్నది దుర్మార్గం. వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో.. రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్‌ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. అది మామూలుగా ఉండదు' అని జ‌గ‌న్ వార్నింగ్‌ ఇచ్చారు.

'ప...