Hyderabad, సెప్టెంబర్ 10 -- పితృదేవతల అనుగ్రహం పొందడానికి, పితృదేవతలను సంతోష పెట్టడానికి, వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. పితృపక్షం సమయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, వారి పేరు చెప్పి దాన ధర్మాలు చేయడం, తర్పణాలు వదలడం వంటివి అనుసరించడం వలన పితృ దేవతల అనుగ్రహం పొందవచ్చు.

నిజానికి పితృ దోషాన్ని తొలగించడానికి ఈ 15 రోజులు చాలా ముఖ్యమైనవి. పితృపక్షంలో పూర్వికులను సంతృప్తిపరచడానికి చాలామంది రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. సనాతన ధర్మంలో పితృపక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఈసారి పితృపక్షం సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఉంది. జాతకంలో పితృదోషం ఉన్నవారు పిల్లల ఆనందాన్ని పొందలేరు. పిల్లలు చెడ్డదారి పడతారు. ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పేదరికాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలేమీ రాకుండా ఉండడానికి, ...