భారతదేశం, సెప్టెంబర్ 1 -- అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడారు. ఎవరైనా పింఛను తీసుకోకున్నా.. తర్వాతి నెల అందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి జరగాలని, ఆదాయం పెరగాలని చెప్పారు. సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని చంద్రబాబు అన్నారు. అప్పులు చేస్తే ఏ కుటుంబం కూడా బాగుపడదని చెప్పారు. ఆదాయం పెంచుకుంటేనే జీవితాల్లో మార్పు సాధ్యమని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం అనేక కష్టాలు వచ్చాయన్నారు సీఎం. 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి చేసి చూపించామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంస్కరణలు తెస్తున్నారని, అందులో మన రాష్ట్రం కీలక పాత్ర పోషించా...