Telangana,siddipet, జూలై 19 -- అవినీతి అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది తెలంగాణ ఏసీబీ. రాష్ట్రవ్యాప్తంగానూ దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే చాలా మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొగా. తాజాగా డిప్యూటీ తహసీల్దార్ చిక్కారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది.

ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.ములుగు మండల తహశీల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ తహశీల్దార్ యెలగందుల భవాని పని చేస్తున్నారు. అయితే ఓ రైతు పాస్ పుస్తకం కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు రూ. 2 లక్షలు డిమాండ్ చేసింది. ఇవ్వలేని స్థితిలో ఉన్న బాధితుడు. ఏసీబీని ఆశ్రయించినట్లు అధికారులు వెల్లడించారు.

ఒకవేళ ఏ ప్రభుత్వాధికారి, సిబ్బంది అయినా లంచం అడిగినట్లయితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కోరారు. అవినీతినిరోధకశాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకు...