Telangana,hyderabad, జూలై 1 -- సంగారెడ్డి జిల్లా : పాశమైలారం పేలుడు ఘటనాస్థలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. సిగాచి పరిశ్రమను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షించారు. పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాజా ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే తనిఖీ చేసిన అధికారులతో కాకుండా కొత్త వారితో విచారణ జరిపించాలని స్పష్టం చేశారు.

బాధితులకు ప్రభుత్వం తరుఫున అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటివరకు జరగలేదన్న ఆయన. సిగాచి ప్రమాదం దురదృష్టకరమన్నారు. అత్యంత విషాద ఘటన అని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నామని చెప్పారు.

"కంపెనీ వాళ్లతో మాట్లాడి మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం అందించేలా చూస్తాం. గాయప...