Sangareddy,telangana, జూలై 2 -- సంగారెడ్డి జిల్లాలో పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందగా. మరికొంత మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై యాజమాన్యం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు సిగాచి కంపెనీ యాజమాన్యం. పేలుడు ఘటనపై స్పందించింది. ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది.

పాశమైలారంలో పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు సిగాచి కంపెనీ తరపున రూ.1 కోటి ఆర్ధిక సాయం అందజేస్తామని తెలిపింది. ప్రమాదంలో 40 మంది చనిపోయారని. 33 మందికి గాయాలైనట్లు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు అన్ని రకాల బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తామని స్పష్టం చేసింది. గాయపడిన వారికి పూర్తి వైద్య సహాయం అందిస్తామని. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సిగాచి కంపెనీ సెక్రటరీ వ...