భారతదేశం, జూలై 16 -- పావురాలతో దీర్ఘకాలికంగా సంబంధం పెట్టుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఊపిరితిత్తుల వైఫల్యం వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని పల్మనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో పావురాల జనాభా ఎక్కువగా ఉంది. అలాంటి ప్రాంతాల్లో నివసించేవారు లేదా పనిచేసేవారు ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తానే స్వయంగా ఎన్నో కేసులను చూశానని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని థానేలోని కిమ్స్ హాస్పిటల్స్ కన్సల్టెంట్, పల్మనాలజీ డాక్టర్ రవీంద్ర సాంగ్లికర్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. "పావురాలకు దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ మంది భారతీయులు అనారోగ్యం పాలవుతున్నారు. పావురాల రెట్టలు, ఈకలలో ఉండే సూక్ష్మ ధూళి హైపర్సెన్సిటివిటీ న్యుమోనైట...