Hyderabad, మే 12 -- వేసవి కాలంలో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తే త్వరగా ఫలితాలు వస్తాయి. కాబట్టి ఎలాంటి ఆహారం తినడం ద్వారా బరువు తగ్గించుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బరువు తగ్గే ప్రయాణంలో మీకు ఓట్స్ మీల్ ఎంతో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఓట్స్ మీల్ ప్రతిరోజు తినడం ద్వారా వేసవిలో త్వరగా బరువు తగ్గవచ్చు.

ఓట్స్ మీల్‌తో చేసే పానీయాలలో పాలు, చక్కెర వాడే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఈ రెండూ వాడడం వల్ల మీరు బరువు త్వరగా తగ్గరు. కాబట్టి ఎలా తింటే బరువు తగ్గుతారో ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి.

ఓట్స్ మీల్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఓట్స్ లో బీటా గ్లూకాన్ అనే ఒక ముఖ్యమైన ఫైబర...