Hyderabad, మే 11 -- ప్రసవం అనేది ఒక స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ సమయంలో ఆమె శరీరం అనేక మార్పులకు గురవుతుంది. తన ఆరోగ్యంపై, శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తగా తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా శిశువుకు పాలివ్వడం అనేది ప్రధాన ప్రక్రియ. ఇది తల్లి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సమయంలో తల్లి సరైన పోషకాహారం తీసుకోవడం చాలా కీలకం.

బలమైన పోషణ కేవలం తల్లి త్వరగా కోలుకోవడానికి మాత్రమే కాదు, ఆమె రోగనిరోధక శక్తిని పెంచడానికి, శక్తివంతంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు తల్లి తీసుకునే ఆహారం నేరుగా ఆమె పాల నాణ్యతను ప్రభావితం చేస్తుంది. శిశువు ఎదుగుదల, అభివృద్ధికి తల్లి పాలు అత్యంత ముఖ్యమైన పోషకాహార వనరు. కాబట్టి, తల్లి తీసుకునే ఆహారం శిశువు ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

బెంగళూరులోని శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్రిలో క్లినికల్ డైటీ...