భారతదేశం, ఆగస్టు 6 -- సాధారణంగా ఎముకలు, కీళ్లు గట్టిపడాలంటే కాల్షియం, విటమిన్ డి మాత్రమే తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజం కాదని ప్రముఖ డైటీషియన్, వెల్నెస్ కోచ్ డాక్టర్ సిమ్రత్ కథూరియా చెబుతున్నారు. పాలు తాగలేని వారు, లేదా శాకాహారులు (plant-based diet) కాల్షియం కోసం ఏ ఆహారాలు తీసుకోవాలో ఆమె వివరించారు.

చాలామందికి పాలు సరిపడకపోవడం, ఇంకొందరు శాకాహారాన్ని ఎంచుకోవడం వల్ల కాల్షియం కోసం ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం అని ఆమె అన్నారు. రాగులు, సోయా ఉత్పత్తులైన టోఫు, బాదం పప్పులు, ఫొర్టిఫైడ్ ప్లాంట్ మిల్క్ వంటివి పాలతో సమానమైన పోషకాలను అందిస్తాయని డాక్టర్ సిమ్రత్ తెలిపారు.

సాధారణంగా శీతాకాలంలో వంటింట్లో ఎక్కువగా వాడే మెంతులకు ఇప్పుడు మరిన్ని మంచి విషయాలు తోడయ్యాయి. ఈ మెంతుల్లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన...