Hyderabad, ఏప్రిల్ 14 -- బ్యూటీ పార్లర్లలో ఫేషియల్ చేయించుకోవడానికి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ధరలకు భయడమే చాలా మంది వాటికి వెళ్లడం లేదు. నిజానికి బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మీరు చర్మాన్ని మెరిపించుకోవచ్చు. ఇంటి దగ్గర స్టీమ్ ఫేషియల్ ప్రయత్నించవచ్చు. ఇది చర్మానికి మంచి ఫలితాలను ఇస్తుంది. మురికిని తొలగించి మెరిపిస్తుంది.

ఉద్యోగినులు, కాలేజీ అమ్మాయిలు మెరిసే చర్మం పొందాలనుకుంటారు. అందుకోసం పార్లర్ కు వెళ్లి ఫేషియల్స్, బ్లీచింగ్ వంటి బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుంటారు. ఇవి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ వాటికి చెల్లించే డబ్బులను భరించడం మాత్రం అందరితరం కాదు.

అంతేకాదు చర్మాన్ని మెయింటైన్ చేయడానికి రకరకాల క్రీములు, లోషన్లు కూడా ఉపయోగిస్తుంటారు.ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. అయితే వాటిని అధికంగా వాడడం క...