భారతదేశం, ఆగస్టు 22 -- దేశ రాజధాని దిల్లీలోని పార్లమెంట్​ గోడను దూకేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడన్న వార్త కలకలం రేపింది. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపు రెండేళ్ల క్రితం పార్లమెంట్​లో జరిగిన చొరబాటు సంఘటనను ఇది గుర్తుచేస్తోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ వ్యక్తి పార్లమెంట్​ గోడ ఎక్కి, లోపలికి దూకడానికి ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటనపై హెచ్‌టీ వార్తా సంస్థతో మాట్లాడిన రాజ్యసభ అధికారి ఒకరు.. "ఈరోజు ఉదయం 6 గంటలకు ఒక వ్యక్తి అనధికారికంగా భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అతన్ని పట్టుకున్నాము," అని తెలిపారు.

దిల్లీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు పార్లమెంట్ గోడ ఎక్కేందుకు ప్రయత్నించాడు? అనే వివరాలు ఇంకా తెలియ...