భారతదేశం, ఆగస్టు 22 -- దేశ రాజధాని దిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో గోడను దూకేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడన్న వార్త కలకలం రేపింది. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపు రెండేళ్ల క్రితం పార్లమెంట్లో జరిగిన చొరబాటు సంఘటనను ఇది గుర్తుచేస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ వ్యక్తి పార్లమెంట్ గోడ ఎక్కి, లోపలికి దూకడానికి ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటనపై హెచ్‌టీ వార్తా సంస్థతో మాట్లాడిన రాజ్యసభ అధికారి ఒకరు.. "ఈరోజు ఉదయం 6 గంటలకు ఒక వ్యక్తి అనధికారికంగా భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అతన్ని పట్టుకున్నాము," అని తెలిపారు.
దిల్లీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు పార్లమెంట్ గోడ ఎక్కేందుకు ప్రయత్నించాడు? అనే వివరాలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.