భారతదేశం, డిసెంబర్ 1 -- పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కేంద్రం 13 ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎస్​ఐఆర్​ (ఓటర్​ లిస్ట్ ప్రత్యేక​ సవరణ), దేశంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం వంటి అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు కసరత్తులు చేస్తున్నాయి.

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు డిసెంబర్​ 19 వరకు కొనసాగుతాయి. ఈ కాలంలో లోక్​సభ, రాజ్యసభలో 15 సిట్టింగ్​లు జరగనున్నాయి.

ఈ సమావేశంలో ఆమోదం పొందడానికి సిద్ధంగా ఉన్న కీలక బిల్లులను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

పార్లమెంట్​ సమావేశాలు మొదలైన వెంటనే లోక్​సభలో గందరగోళం నెలకొంది. ఎస్​ఐఆర్​పై చర్చ జరపాలని విపక్షాలు నిరసనకు దిగాయి. వారిని కూర్చోపెట్టేందుకు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా ప్రయత్నించారు. విపక్ష ఎంపీల అరుపుల మధ్య ప్ర...