భారతదేశం, ఆగస్టు 25 -- ఓటీటీలోకి మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతోంది. హాట్ బ్యూటీస్ తమన్నా భాటియా, డయానా పెంటీ క్రేజీ కాంబినేషన్లో ఓ సిరీస్ రెడీ అవుతోంది. ప్రజెంట్ డే రిలేషన్ షిప్స్, ఈ జనరేషన్ మెంటాలిటీ ఆధారంగా ఈ సిరీస్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలిసింది. 'డు యు వాన్నా పార్ట్‌న‌ర్' పేరుతో ఈ క్రేజీ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరో అదిరిపోయే వెబ్ సిరీస్ వస్తుంది. 'డు యు వాన్నా పార్ట్‌న‌ర్' పేరుతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి ప్రీమియర్ కానున్నట్లు ఇవాళ (ఆగస్టు 25) ప్రైమ్ వీడియో ప్రకటించింది. కొత్త సిరీస్ ప్రైమ్ వీడియోలోకి వస్తుందని వెల్లడించింది. ఇది కామెడీ డ్రామా బోల్డ్ సిరీస్ గా ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేస్తుంది.

కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్...