భారతదేశం, నవంబర్ 1 -- భారత టెన్నిస్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం ముగిసింది. ఓ గోల్డెన్ ఎరాకు ఎండ్ కార్డు పడింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత టెన్నిస్ లో స్టార్ ప్లేయర్ గా కొనసాగిన రోహన్ బోపన్న రాకెట్ వదిలేశాడు. ప్రొఫెషనల్ టెన్నిస్ కు గుడ్ బై చెబుతున్నట్లు శనివారం (నవంబర్ 1) ప్రకటించాడు. దీంతో భారత టెన్నిస్ లో ఓ శకం ముగిసింది.

భారత టెన్నిస్‌లో సుదీర్ఘకాలం పాటు అగ్రగామిగా నిలిచిన రోహన్ బోపన్న.. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన అద్భుతమైన కెరీర్‌కు తెరదించాడు. శనివారం ప్రొఫెషనల్ క్రీడల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. పారిస్ మాస్టర్స్ 1000 టోర్నమెంట్ బోపన్న కెరీర్‌లో చివరిది కావడం గమనార్హం. ఈ టోర్నీలో అతను కజకిస్థాన్‌కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్‌తో జతకట్టాడు. ఈ జోడీ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో జాన్ పీర్స్, జేమ్స్ ట్రేసీ చేతిలో 5-7, 6-2, 10-8 తేడా...