భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారానికి సంబంధించి పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆధారాలు చూపలేదని తీర్పులో చెప్పారు.

ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవన్న స్పీకర్.. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సాంకేతికంగా చూస్తే.. ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నట్టుగా తెలిపారు. మెుత్తం 10 మంది ఎమ్మెల్యేల గురించి అనర్హత పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి అయింది. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన ప...