భారతదేశం, జనవరి 15 -- తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై అనర్హత పిటిషన్లను కొట్టివేసారు. కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తీర్పు ఇచ్చారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు క్లియర్ అయ్యారు.

ఎమ్మెల్యేల అనర్హత కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. దానికి ముందు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య బీఆర్ఎస్‌కు చెందినవారని ఆయన తీర్పు ఇచ్చారు. వారు పార్టీలు మారారని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.

దీంతో ఫిరాయింపు ఆరోపణల...