భారతదేశం, మే 12 -- పార్కులు, ర‌హ‌దారులు, ప్రజావ‌స‌రాల‌ కోసం కేటాయించిన స్థలాల‌ను కాపాడాల్సిన కాల‌నీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే వాటిని ఆక్రమిస్తున్నారు. ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థలాల‌ను వ్యాపారుల‌కు దారాద‌త్తం చేయ‌డం లేదా ప్లాట్లుగా ప‌త్రాలు సృష్టించి అమ్మేస్తున్నారు.

బ‌స్తీ, కాల‌నీ సంక్షేమ సంఘాల నాయ‌కులుగా చెలామ‌ణి అవుతూ పార్కుల స్థలాలు కొట్టేస్తున్నారని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించి లే ఔట్‌ల‌లో కేటాయించిన స్థలాలను ఏదో ఒక రూపంలో అమ్మేస్తున్నారంటూ ప‌లువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాల‌నీవాసులకు వాటిపై హ‌క్కు లేకుండా చేస్తున్నార‌ని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

నిజాంపేట మున్సిప‌ల్ కార్పోరేష‌న్ లో స‌ర్వే నంబ‌రు 181, 183 ప‌రిధిలోని సాయిల‌క్ష్మి లేఔట్‌లోని 1800 గ‌జాల పార్కు స్థలం క‌బ్జా...