Hyderabad, ఆగస్టు 8 -- తమిళంలో పార్కింగ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. పార్కింగ్ విషయం కారణంగా ఇద్దరు ఏ స్థాయిలో గొడవ పడతారో, ఎక్కడి వరకు వెళ్తారో చూశాం. అలాంటి ఘటన నిజ జీవితంలో చోటు చేసుకుంది. ఇంకా చెప్పాలంటే సినిమాలో కంటే దారుణంగా ఇక్కడ ఓ వ్యక్తిని హత్య చేశారు.

అందులోను ఆ వ్యక్తి ప్రముఖ హీరోయిన్ సోదరుడు కావడం మరింత వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషికి కజిన్ సోదరుడు అయిన ఆసిఫ్ ఖురేషీ (42) హత్యకు గురయ్యాడు. గురువారం (ఆగస్ట్ 7) రాత్రి ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో చోటు చేసుకున్న పార్కింగ్ స్థలం వివాదం కారణంగా ఆసిఫ్‌ను హత్య చేశారు.

ఈ కేసులో ఇద్దరు నిందితులును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి హత్యా ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటి ప్రధాన ద్వారానికి దూరంగా లేదా పక్కకు ద్విచక్ర వాహన...