Andhrapradesh, ఆగస్టు 24 -- రాష్ట్రంలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కోటి రూపాయల బీమాను ప్రకటించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు వారి ఆరోగ్యాలను పణంగా పెడుతున్న మున్సిపల్ కార్మికుల సంక్షేమాన్నిబాధ్యతగా తీసుకుంటామని చెప్పారు.

కొత్త వేతన అకౌంట్ల ద్వారా రాష్ట్రంలో పని చేస్తున్న 55,686 మంది కార్మికులకు అదనపు ప్రయోజనం చేకూరుస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రమాదవశాత్తూ మరణించిన రెగ్యులర్ కార్మికులకు రూ.1 కోటి, ఔట్‌సోర్సింగ్ వర్కర్లకు రూ.20 లక్షల చొప్పున వారి కుటుంబాలకు బీమా సొమ్ము అందజేస్తామని ప్రకటించారు. శాశ్వత వైకల్యం పొందినా ఇంతే మొత్తాన్ని అందిస్తామని వివరించారు. అదేవిధంగా వారి పిల్లలకు రూ. 8 లక్షల వరకు విద్యా సాయం చేస్తామన్నారు. కాకినాడ జ...