Hyderabad, ఫిబ్రవరి 17 -- పండుగైనా, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు వంటి వేడుకలు ఉన్నా ఇంట్లో పాయసం ఉండాల్సిందే. పాయసంలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏదైనా కూడా పాయసం చాలా తీపిగా ఉంటుంది. పాయసంలో కచ్చితంగా పంచదార పడాల్సిందే. తీపి తినాలనుకుంటే చాలు నిమిషాల్లో పాయసం వండేసుకోవచ్చు. పాయసం వివిధ పదార్థాలతో వివిధ రకాలుగా తయారు చేస్తారు. చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ, పాయసం చేసేటప్పుడు కొన్నిసార్లు పంచదాక ఎక్కువగా పడిపోతుంది. దీనివల్ల పాయసం చాలా తీయగా మారిపోతుంది. చాలా తీయగా ఉంటే పాయసం తినడం కష్టం అవుతుంది. తీపిగా ఉండే పాయసం తినడం చాలా కష్టం. అలాంటి సమయాల్లో పాయసంలోని తీపిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి.

కొబ్బరి పాలు: పాయసం చాలా తీయగా అనిపిస్తే వెంటనే కొబ్బరి పాలు లేదా తురిమిన కొబ్బరిని కలపండి. ఇది తీపిని తగ్గిస్తుంది. ఇది మంచి ర...