భారతదేశం, మే 6 -- స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ వరల్డ్ వైడ్ చాలా పాపులర్. ఇండియాలోనూ ఈ సిరీస్‍కు చాలా ఆదరణ దక్కింది. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లు భారీ సక్సెస్ అయ్యాయి. 2021లో వచ్చిన తొలి సీజన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూడేళ్ల తర్వాత గతేడాది డిసెంబర్‌లో రెండో సీజన్ వచ్చింది. ఇప్పుడు స్క్విడ్ గేమ్ మూడో సీజన్ అప్పుడే రెడీ అయింది. నేడు (మే 6) సీజన్ 3 టీజర్ వచ్చేసింది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

స్క్విడ్ గేమ్ 2 ముగిసిన దగ్గరి నుంచే ఈ మూడో సీజన్ షురూ కానుంది. పింక్ డ్రెస్ వేసుకున్న గార్డులు ఓ శవపేటికను మోసుకురావటంతో స్క్విడ్ గేమ్ 3 టీజర్ మొదలైంది. అక్కడ ఉన్న ప్లేయర్లలో భయం చూసేందుకు వారు ఇలా శవ పేటికను తీసుకొస్తారు. ఇతర ప్లేయర్లు దగ్గరికి వచ్చి చూస్తారు. కానీ ఆ శవపేటికలో వారు ఊహించని విధంగా షియాంగ్ జీ హున్ (లీ జంగ్ జీ) ఉంటాడు. కళ్లు తెరుస్త...