Hyderabad, అక్టోబర్ 2 -- పాపాంకుశ ఏకాదశి ముహూర్తం: దసరా మరుసటి రోజున పాపాంకుశ ఏకాదశి జరుపుకుంటారు. ప్రతీ ఏటా పాపంకుశ ఏకాదశి ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో వస్తుంది. ఈ ఏడాది ఇది అక్టోబర్ 3న వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉంటే ఎంతో గొప్ప ఫలితం వస్తుంది. ఈ ఏకాదశి నాడు భక్తితో విష్ణువుని ఆరాధించి, ఉపవాసం ఉంటే పాపాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండచ్చు.

ఏకాదశి తిథి అక్టోబర్ 2 రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది, కానీ ఉదయ తిధి ప్రకారం చూసుకోవాలి కనుక పాపాంకుశ ఏకాదశిని అక్టోబర్ 3న జరుపుకోవాలి. ఈ రోజున, శ్రావణ నక్షత్రంతో ధనిష్ట నక్షత్రం కలయిక వుంది. అంతే కాకుండా, ధృతి యోగం రాత్రి 09:45 గంటల వరకు ఉంటుంది.

ఈ రోజున, విష్ణుమూర్తితో కలిసి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది.

కుడివైపున శంఖం పెట్టి విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని అభిషేకించండి...