భారతదేశం, డిసెంబర్ 28 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. కొన్ని నెలల క్రితమే 'ఎల్2: ఎంపురాన్' (లూసిఫర్ 2)తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అతడు.. ఇప్పుడు 'వృషభ' (Vrusshabha) సినిమాతో తన కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ఫలితాన్ని చవిచూశాడు. రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు.

కొన్ని నెలల కిందట 'ఎంపురాన్' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మోహన్‌లాల్.. క్రిస్మస్ కానుకగా వచ్చిన 'వృషభ'తో గట్టి దెబ్బ తిన్నాడు. ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే ట్రేడ్ పండితులు కూడా నోరెళ్లబెడుతున్నారు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజైంది. ఆరోజు హాలిడే అయినా కూడా ఇండియాలో కేవలం రూ. 60 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక రెండో రోజు రూ. 22 లక్షలు, మూడో రోజు (శనివారం) రూ. 24 లక్షలు మాత్...