భారతదేశం, జూలై 9 -- తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ఆర్జంట్ గా ఓ హిట్ కావాలి. ఆయన నటించిన 'ఖుషి', 'లైగర్', 'ది ఫ్యామిలీ మ్యాన్' చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. అందుకే కొత్త సినిమా 'కింగ్‌డమ్'పై విజయ్ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. కానీ రిలీజ్ విషయానికి వస్తే మాత్రం హిందీలో విడుదల చేయలేమని ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు. మరి ఎందుకిలా?

వరుస ఫ్లాప్ ల తర్వాత కొంత విరామం తీసుకున్న విజయ్ దేవరకొండ.. 'జెర్సీ', 'మల్లి రావా' వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్‌డమ్' అనే చిత్రంలో నటించారు. అయితే చిత్రం హిందీలో విడుదల కాదు. ప్రమోషన్స్ ప్రారంభించిన నిర్మాతలు ఈ సినిమా హిందీలో విడుదల కాదని తాజాగా వెల్లడించారు. మొదటగా ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఈ మూవీ హిం...