Hyderabad, సెప్టెంబర్ 18 -- ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్నాడు. చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ కాయిన్. శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా జైరామ్ చిటికెల తెరకెక్కిస్తున్నారు. కాయిన్ టైటిల్ పోస్టర్‌ను బుధవారం (సెప్టెంబర్ 18) రిలీజ్ చేశారు.

చంద్రహాస్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా కాయిన్ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో హీరో చంద్రహాస్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ .. "యథార్థ సంఘటనల ఆధారంగా మా దర్శకుడు జైరామ్ ఈ 'కాయిన్' మూవీని తీస్తున్నారు. పాత ఐదు రూపాయల కాయిన్స్‌ని బ్యాన్ చేయడం, ఆ కాయిన్స్ మెల్ట్ చేయడం, వాటి నేపథ్యంలో క్రైమ్ అనే పాయింట్లతో అద్భుతంగా కథను రాసుకున్నారు" అని అన్నాడు.

"జైరామ్ పనితనం నాకు చాలా నచ్చింది...