భారతదేశం, ఆగస్టు 30 -- పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం (94) అనారోగ్యంతో శనివారం (ఆగస్టు 30) కన్నుమూశారు. అల్లు అర్జున్ కు ఆమె నానమ్మ. మెగాస్టార్ చిరంజీవికి అత్తయ్య. రామ్ చరణ్ కు అమ్మమ్మ. అల్లు కనకరత్నం పార్థివ దేహానికి చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో పాటు త్రివిక్రమ్, వెంకటేష్, నాగ చైతన్య తదితరులు నివాళి అర్పించారు.

చిరంజీవి భార్య సురేఖ వాళ్ల అమ్మ అల్లు కనకరత్నం. ఆమె మరణం పట్ల చిరంజీవి బాగా ఎమోషనల్ అయ్యారు. స్వయంగా పాడె మోసి కన్నీటి వీడ్కోలు పలికారు. చిరంజీవితో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా పాడె మోశారు. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కూడా పాడె మోశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చిరంజీవి, అల్లు అర్జున్, అల్లు అయాన్ ముందుండగా.. రామ్ చరణ్ వెనకాల పాడె ఎత్తుకుని ఉన్నాడు. ...