భారతదేశం, మే 4 -- పాడి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన పాడి రైతులకు 50 శాతం రాయితీతో పోషకాలతో కూడిన పశువుల దాణా అందించనుంది.

ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రెండు పెద్ద పశువులు, ఒక దూడకు 90 రోజులకు గాను 450 కేజీల దాణాను పంపిణీ చేయనుంది. రూ.1100 విలువైన 50 కేజీల దాణా బస్తాను రూ.555కే అందించనుంది. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.

పశువుల పెంపకందారులకు పోషకాలతో దాణా అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కిలో రూ.22.11కు కొనుగోలు చేసి రైతు సేవా కేంద్రాలు, పశు వైద్యశాలల ద్వారా రూ.11.10కే పంపిణీ చేయనుంది. 20 శాతం ప్రొటీన్ కలిగిన పశువుల దాణాను పాడిరైతులకు అందించనుంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన పాడిరైతులను ఈ లబ్ధి పొందేందుకు అర్హులుగా నిర్ణయించిం...