భారతదేశం, జూలై 21 -- బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్, కాలేజీ క్యాంపస్‌లో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ జెట్ F-7 BJI కూలిపోయింది. ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 19 మంది మరణించారు. మరో 100 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పైలెట్‌తోపాటుగా 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు.

పాఠశాల క్యాంపస్ తీవ్రంగా దెబ్బతింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ప్రమాదం తర్వాత చుట్టుపక్కల పొగ, కేకలు వ్యాపించాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో తీవ్రత ఎక్కువగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అగ్నిమాపక సిబ్బంది విమానం శిథిలాలపై నీటిని కొట్టారు. జనాలు కేకలు వేయడం, ఏడుస్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి. 'నేను పిల్లలను తీస...