భారతదేశం, డిసెంబర్ 7 -- బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయంపై టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్. ఈ మేరకు టిటిడి ఛైర్మెన్ కు లేఖ రాశారు.

సదరు స్థలంలో టీటీడీ ఆలయాన్ని నిర్మించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాట్నాలో టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

ఈ భూమిని 99 సంవత్సరాల పాటు రూ. 1 టోకెన్ లీజ్ రెంట్ తో ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తామని టిటిడి ఛైర్మెన్ తెలిపారు.

ఈ మహత...