భారతదేశం, మే 10 -- పరేషన్ సిందూర్‌పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు ఇద్దరు మహిళా సైనికాధికారులు పాల్గొన్నారు. కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. పశ్చిమ సరిహద్దుల్లో పాక్ సైన్యం నిరంతరం దాడులు చేస్తోంది. భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, యుద్ధ ఆయుధాలు, యుద్ధ విమానాలను ఉపయోగించిందన్నారు. భారత్ తిప్పికొట్టిందని చెప్పారు.

26కు పైగా చోట్ల వాయు మార్గం ద్వారా చొరబడేందుకు పాక్ ప్రయత్నించిందని, ఉధంపూర్, భుజ్, పఠాన్ కోట్, బటిండాలోని దాడులు జరుపుతోందని చెప్పారు. తెల్లవారుజామున 1:40 గంటలకు పంజాబ్ లోని వైమానిక స్థావరంపైకి హైస్పీడ్ క్షిపణులను ప్రయోగించారని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలపైనా దాడులు చ...