భారతదేశం, మే 9 -- పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్‌ను శుక్రవారం మరోసారి వింతైన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన చేసిన కొత్త ప్రకటనపై ప్రపంచంలోనూ దుమారం రేగుతోంది. భారత డ్రోన్లను ఎందుకు అడ్డగించలేదంటే.. వింత వివరణ ఇచ్చారు. తమ సైనిక స్థావరాల కచ్చితమైన ప్రదేశాలను బహిర్గతం చేయకుండా ఉండటానికి పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా భారత డ్రోన్లను అడ్డుకోలేదని ఆయన ఒక విచిత్రమైన వాదన చేశారు. భారత్-పాక్ మధ్య జరుగుతున్న వివాదంపై ఆసిఫ్ వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ.. 'నిన్న జరిగిన డ్రోన్ దాడి ప్రాథమికంగా మా లొకేషన్ తెలుసుకోవడానికి. అందుకే మా లొకేషన్ లీక్ కాకుండా ఉండేందుకు భారత డ్రోన్లను ఆపలేదు. ఒకవేళ మేం వాటిని అడ్డగించి ఉంటే మా సైనిక కీలక స్థావరాల వివరాలు భారత్‌కు తెలిసిపోయే అవకాశం ఉం...