భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన మధ్యలోనే ముగించుకుని భారత్ వచ్చారు. బుధవారం ఉదయం దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే దిగారు. వెంటనే అక్కడే ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించారు.జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి ఈ ముఖ్యమైన సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో దాడి తీవ్రత, అంతర్జాతీయ ప్రతిస్పందన, భద్రతా వ్యూహాలపై చర్చించారు.

సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చారు. పహల్గామ్‌లో ఉగ్రదాడితో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా వెంటనే తిరిగి రావాలని మోదీ నిర్ణయించుకున్...