భారతదేశం, మే 20 -- ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ను ఫీల్డ్ మార్షల్ స్థాయికి ప్రమోట్ చేసే ప్రతిపాదనకు పాక్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపిందని మంగళవారం ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. పాకిస్తాన్ ఆర్మీలో అత్యున్నత పదవి ఫీల్డ్ మార్షల్.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఆ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మూడు రోజుల పాటు దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఆ తరువాత కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఆ తరువాత కొద్ది రోజులకే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ను ఫీల్డ్ మార్షల్ స్థాయికి ప్రమోట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. భారత్ పై దాడుల్లో ఆసిఫ్...