భారతదేశం, మార్చి 5 -- పాకిస్థాన్ వాయవ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బన్ను జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ ఉగ్రదాడి జరిగింది. ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలతో ఆర్మీ కంటోన్మెంట్ గేటులోకి దూసుకెళ్లడంతో పేలుడు సంభవించింది. ఆ తర్వాత పలువురు ఉగ్రవాదులు లోపలికి చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా బలగాలు వారిని అడ్డుకుని ఎదురుదాడికి దిగాయి. తాజా సమాచారం ప్రకారం ఈ దాడిలో 9 మంది మరణించారు. 25 మందికి గాయాలు అయ్యాయి.

ఉగ్రవాదులు గేటును పేల్చి కంటోన్మెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, అయితే ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇందులో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు నిర్ధారించారు.

బన్ను జిల్లా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు...