భారతదేశం, జూన్ 28 -- పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో సైనిక కాన్వాయ్ పై ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో దూసుకెళ్లడంతో 13 మంది సైనికులు మృతి చెందారు. 10 మంది సైనికులు, 19 మంది పౌరులు గాయపడ్డారు. 'ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో పాకిస్తాన్ మిలటరీ కాన్వాయ్ లోకి దూసుకెళ్లాడు. ఈ పేలుడులో 13 మంది సైనికులు మరణించగా, 10 మంది సైనికులు, 19 మంది పౌరులు గాయపడ్డారు' అని పాక్ ఆర్మీ అధికారి విలేకరులకు తెలిపారు.

పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి రెండు ఇళ్ల పైకప్పులు కూలాయని, ఆరుగురు చిన్నారులు గాయపడ్డారని ఖైబర్ పఖ్తుంఖ్వాలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకపోయినప్పటికీ ఈ ప...