భారతదేశం, మే 17 -- ర్యానాలోని హిసార్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై అరెస్టు అయింది. 'ట్రావెల్ విత్ జో' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన జ్యోతికి 3,77,000 మందికి పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఉత్తర భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న పాకిస్థాన్ లింక్డ్ గూఢచర్యం నెట్‌వర్క్‌లపై జరుగుతున్న దర్యాప్తులో జ్యోతి ఇప్పుడు కీలకంగా మారింది.

గూఢచర్యం, సున్నితమైన భారత సమాచారాన్ని పాక్ నిఘా సంస్థలకు చేరవేశారనే ఆరోపణలపై జ్యోతి మల్హోత్రాను హిసార్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆమెకు ఐదు రోజుల పోలీసు రిమాండ్ విధించింది. హర్యానాలో మెుత్తం ఆరుగురిని గూఢచర్యం కేసులో అదుపులోకి తీసుకున్నారు.

జ్యోతి మల్హోత్రా ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్. పాక్‌లో చాలాసార్లు పర...