భారతదేశం, మార్చి 12 -- పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో దాదాపు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలును హైజాక్ చేశారు. ఈ దాడికి తామే బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) ప్రకటించింది. 214 మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని, 30 మంది పాక్ సైనికులను హతమార్చామని పేర్కొంది. భద్రతా బలగాలు వెనక్కి తగ్గకపోతే బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయే సమయానికి పాకిస్థాన్ భద్రతా దళాలు రైలు నుంచి 80 మంది ప్రయాణికులను రక్షించాయి.

బలూచ్ రాజకీయ ఖైదీలను, జాతీయ ప్రతిఘటన కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని మిలిటెంట్ గ్రూప్ డిమాండ్ చేసింది. అందుకు ప్రతిఫలంగా బందీలను విడిపించేందుకు 48 గంటల గడువు విధించారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని స్థానిక మీడియా తెలిపింది.

క్వెట్ట...